![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -258 లో.. కృష్ణ తన గదిలో ఉంటుంది. మురారి రావడం గమనించిన కృష్ణ డోర్ వెనకాల దాక్కొని ఉంటుంది.. మురారి గదిలోకి రాగానే మురారి కట్టుకున్న పంచె ఊడిపోతుంది. కృష్ణ సిగ్గుపడుతూ మురారి దగ్గరకి వస్తుంది. ఎంత గదిలో ఎవరు లేకుంటే ఇలా ఉంటారా చూడలేపోతున్నానని కృష్ణ అంటుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ వెళ్ళిపో అని మురారి అంటాడు. మురారికి పంచె కట్టుకోవడం రాకపోవడంతో మురారికి కృష్ణనే పంచె కడుతుంది.
మరొకవైపు శ్రీనివాస్ ని భవాని.. ముకుంద ప్రేమ గురించి అడుగుతుంది. మాకు తెలియని విషయాలు, మీకెలా తెలుసని భవాని అడుగుతుంది. మీ కూతురు మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారని భవాని అంటుంది. మరొక వైపు అక్కడే ఉన్న రేవతి.. శ్రీనివాస్ కి వాళ్ళ ప్రేమ విషయం చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తుంది. నా కూతురు గురించి ఆలోచించాలా? కృష్ణ జీవితం గురించి ఆలోచించాలా అని శ్రీనివాస్ అనుకుంటాడు. ఆదర్శ్ ఇన్ని రోజులైన రాలేదు . రావడం ఇష్టం లేదేమో అని నార్మల్ గా అన్నాను. అంతే గాని నాకే విషయం తెలియదని శ్రీనివాస్ చెప్తాడు. ఆదర్శ్ వస్తే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని భవానీతో శ్రీనివాస్ చెప్పి వెళ్ళిపోతాడు. మరొక వైపు భవానితో శ్రీనివాస్ తన ప్రేమ విషయం చెప్పేసి ఉంటాడనుకొని హ్యాపీగా ఉంటుంది ముకుంద. అప్పుడే ముకుంద దగ్గరకి కృష్ణ వచ్చి మాట్లాడాలని ట్రై చేస్తుంటే.. ఇప్పుడెందుకు వచ్చింది, కృష్ణ ఉంటే నేను ఫ్రీగా నాన్నతో మాట్లాడలేనని భావించిన ముకుంద.. కృష్ణని తన దగ్గర నుండి పంపిస్తుంది. ముకుంద దగ్గర శ్రీనివాస్ వస్తాడు. భవాని అత్తయ్యకి మా ప్రేమ విషయం చెప్పరా అని శ్రీనివాస్ తో ముకుంద అమగా.. లేదని నన్ను క్షమించమని శ్రీనివాస్ చెప్పేసి వెళ్ళిపోతాడు.
మరొక వైపు మధు, ప్రసాద్ లు మందు గురించి మాట్లాడుకుంటారు.. మరొక వైపు కృష్ణ తన నాన్న ఫోటో ని గోడకి పెడుతుంటుంది. మురారి గురించి తన నాన్నకి చెప్తుంది. అప్పుడే మురారి లోపలికి వస్తాడు డోర్ పక్కకి అనగానే కృష్ణ కిందపడతుంటుంది. వెంటనే మురారి పట్టుకుంటాడు. ఇప్పుడు మీరు కావాలనే పట్టుకున్నారు కదా అని కృష్ణ అంటుంది. నేనేం కావాలని పట్టుకోలేదని మురరి అంటాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ముకుంద జాగింగ్ కీ రెడీ అయి ఉంటుంది. పదే పదే తను వేసుకున్న షూ లేస్ కట్టుకుంటూ, తీసేస్తు మురారి కోసం చేస్తుంటుంది. అప్పుడే ముకుంద దగ్గరికి అలేఖ్య వచ్చి.. ఇంకా జాకింగ్ కి వెళ్ళలేదా అని అడుగుతుంది. లేదని, మురారి కోసం వెయిట్ చేస్తున్నానని ముకుంద చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |